నిర్భయంగా ఓటు వేయండి: ఎస్సై మల్లికార్జునరావు

82చూసినవారు
నిర్భయంగా ఓటు వేయండి: ఎస్సై మల్లికార్జునరావు
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోవాలని ఇంకొల్లు మండల ఎస్సై మల్లికార్జునరావు సూచించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇంకొల్లు మండల పరిధిలోని పూసపాడు గ్రామంలోని ఓటర్లకు గురువారం అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కు మన జన్మ హక్కు అని ఎస్సై హితువు పలికారు. ఇంకొల్లు పోలీస్ సిబ్బంది ఎల్లప్పుడూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్