
చీరాల: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చీరాల నుంచి స్వర్ణ వెళ్లే రహదారి వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిమ్మిడిదపాడు గ్రామానికి చెందిన కృష్ణ తన కుటుంబ సభ్యులను ట్రైన్ ఎక్కించి తిరిగి వస్తుండగా వెనకనుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతనికక్కడే అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.