వినుకొండ నియోజకవర్గంలోని ఎస్టీ కాలనీలు, తండాల్లో సమస్యల పరిష్కారాలు, అభివృద్ధి పనుల నిమిత్తం మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అమరావతిలో సమావేశమై చర్చించారు. ఎస్టీ కాలనీలు, తండాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని కోరారు. గ్రామ పంచాయతీలకు సాధారణంగా కేటాయిస్తున్న నిధులకు తోడు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిన అవసరముందని విజ్ఞప్తి చేశారు.