అర్ధరాత్రి రెచ్చిపోయిన అల్లరి మూకలు
పెదనందిపాడు మండలం పమిడివారిపాలెం గ్రామ పొలాల వద్ద అల్లరి మూకలు అర్ధరాత్రి రెచ్చిపోతున్నారు. రైతులు నీళ్ల ఇంజన్లను ద్వారా పొలాల్లో నిలిచిన వరద నీటిని బయటకు పంపేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు నీళ్ల ఇంజన్లకు బిగించిన సేక్షన్ పైపులను కోసి పక్కనే పడేశారు. దీంతో వరద నీరు వెళ్లకుండా చేస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం రైతులు కోరుతున్నారు.