పొన్నూరు మండలంలోని తాళ్లపాలెం, మామిళ్లపల్లి గ్రామాలలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది. ఏవో డేగల వెంకట్రామయ్య పాల్గొని వరి పొలాలు వెన్ను బయటకు వచ్చి పూత దశలో ఉన్నాయని అగ్గి తెగులు ఆశించుటకు ఆస్కారం ఉంది కనుక రైతులు ట్రై సైక్లోజోల్ 75% ఎస్పీ తెగులు మందుని 120 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేయాలన్నారు. రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు.