పొన్నూరు: తెదేపా అధిష్టానం పై తెలుగు మహిళలు ఆగ్రహం
గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ తెలుగు మహిళ నాయకులు తెదేపా అధిష్టానం పై శనివారం పొన్నూరు తెదేపా కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నూరు ఎమ్మెల్యేగా ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ 6 పర్యాయాలు గెలిచిన మంత్రివర్గంలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ స్థానం కల్పించకపోవడం పై వారు దుయ్యబట్టారు. నమ్మకానికి నిబద్ధతకు మారుపేరైన ధూళిపాళ్లనును అధిష్టానం విస్మరించడం పై పలు ఆరోపణలు చేశారు.