
రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని
గుంటూరులోని రమేష్ హాస్పిటల్ సమీపంలోని ఆంధ్ర ముస్లిం కాలేజ్ ఆవరణలో జరిగిన ఈద్గా ప్రార్థనల్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. కఠోర ఉపవాస దీక్షలను ముగించుకున్న ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలని అల్లాను ప్రార్థించినట్టు తెలిపారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం గర్వకారణమని పేర్కొన్నారు.