TGSET 2024 ఫలితాలు విడుదల

53చూసినవారు
TGSET 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TGSET) 2024 ఫలితాలను ఓయూ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో కలిసి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల నిమిత్తం ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 33,494 మంది దరఖాస్తు చేసుకోగా 26,294 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 1,884 మంది అర్హత సాధించారు. ఫలితాల కోసం అభ్యర్థులు TGSET వెబ్‌సైట్ www.telanganaset.orgలో చూసుకోవచ్చు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్