చీమకుర్తి బస్టాండు కూడలి ప్రాంతంలో శనివారం ప్రధాన రహదారి నుంచి పల్లపోతు వారి వీధికి వెళ్లే మార్గంలో మూల మలుపు వద్ద మంచినీటి పైపులైను పగిలిపోయింది. సుమారు గంటకి పైగా నీరు ప్రధాన రహదారిపైకి పారింది. రాత్రివేళ ఈ రీతిలో నీరు పారడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడ్డారు. నీటిని వృథాగా పోకుండా అధికారులు స్పందించి పైపులకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.