
చీమకుర్తిలో కార్పొరేషన్ రుణాల కొరకు దరఖాస్తులు పొడిగింపు
చీమకుర్తి నగర మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ఫిబ్రవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చీమకుర్తి మున్సిపాలిటీ కమిషనర్ వై. రామకృష్ణ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పట్టణ పరిధిలోని బీసీ, ఈ బీసీ, కాపు కార్పొరేషన్ దరఖాస్తు చేసుకునే వారు దగ్గరలోని గ్రామ సచివాలయంలో కానీ, మీ సేవ కేంద్రాలలో కానీ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.