సత్తెనపల్లి ముత్తూట్ ఫైనాన్స్‌లో గోల్డ్ స్కామ్

57చూసినవారు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్‌లో ఉద్యోగులు స్కామ్‌కు తెరలేపారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారాన్ని వేరే ఖాతాదారుల పేరుతో రిజిస్టర్ చేసి సుమారు రూ.40 లక్షలు గోల్‌మాల్ చేసినట్లు సమాచారం.
నగదు చెల్లించినా రశీదు ఇవ్వకుండా కాలయాపన చేస్తుండగా, ఓ కస్టమర్ గట్టిగా నిలదీయగా గురువారం స్కామ్ వెలుగులోకి వచ్చింది. గోల్డ్ స్కామ్‌లో బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ, ఉద్యోగి గోపి పాత్ర ఉందని బాధితులు పేర్కొంటున్నారు.
Job Suitcase

Jobs near you