పెండింగ్ విద్యుత్ బిల్లులు చెల్లించమని అడిగినందుకు తమపై వైసీపీ మాజీ కౌన్సిలర్ భర్త మాధవ, అతని సోదరుడు చంద్ర దాడి చేశారని లైన్ మాన్ శేషు తెలిపారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అనంతరం ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. 2022 నుంచి బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రశ్నిస్తే దుర్భాషలాడారని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లైన్మెన్ శేషు చెప్పారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని లైన్మెన్ కోరాడు.