వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం శివారులో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగి ఒక యువకుడు, గొర్రెలు మృతి చెందిన విషయం తెలిసిందే. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని వినుకొండకు తీసుకువస్తుండగా, యువకుడు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులు జీపును అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.