కేంద్ర వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా లింగ నిర్ధారణ పరీక్షల నిషేధాన్ని పర్యవేక్షించే సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలిగా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి నియమితులయ్యారు. ఈమెతో పాటు మహారాష్ట్రలోని ధూలే లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన డాక్టర్ బచావ్ శోభా దినేష్కూ కేంద్రం సెంట్రల్ సూపర్వైజరీ బోర్డు సభ్యురాలిగా నియమించింది.