జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు

74చూసినవారు
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు నమోదు
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. యాడికి మండలం రాయల చెరువు, తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఇసుక ట్రాక్టర్ల టైర్లకు గాలి తీసి డ్రైవర్లను ఇబ్బందులకు గురి చేశారనే ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. యాడికి, తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి.

ట్యాగ్స్ :