వర్క్ హార్స్.. అత్యంత సమర్థవంతమైన హెలికాప్టర్

77చూసినవారు
వర్క్ హార్స్.. అత్యంత సమర్థవంతమైన హెలికాప్టర్
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌(బెల్-212)ను యూఎస్‌కు చెందిన బెల్ టెక్స్‌ట్రాన్ కంపెనీ తయారు చేసింది. కంపెనీ తయారుచేసే కీలక మోడళ్లలో ఇదీ ఒకటి. అత్యంత సమర్థవంతమైనదిగా భావించే ఈ హెలికాప్టర్‌కు ‘వర్క్ హార్స్’గా పేరుంది. రెండు బ్లేడ్లతో ఉండే ఈ హెలికాప్టర్‌ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాల కోసం వినియోగించుకునేలా రూపొందించారు. ఇందులో సిబ్బంది సహా గరిష్ఠంగా 15 మంది ప్రయాణించవచ్చు.

సంబంధిత పోస్ట్