ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నగదును 24 గంటల్లోనే జమ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్లాలని ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు నాదెండ్ల పేర్కొన్నారు. అలాగే రైతులెవరూ నష్టపోకుండా 24% తేమ ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసేలా మిల్లర్లకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు.