పనస పండులో పనస తొనలు తిని గింజలు పడేస్తుంటాం. కానీ పండుతో పాటు గింజలు కూడా ఆరోగ్యకర జీవనానికి అద్భుతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పనస గింజలలో ఫైబర్, ఒమేగా 3, ఒమేగా 6, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి వాటితో పాటు విటమిన్లు A, C, E, B పుష్కలంగా ఉంటాయి. దీంతో ఈ గింజలను ఆహారంగా తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే గుండె పనితీరు మెరుగవుతుందని వివరిస్తున్నారు.