పంతాలు.. పట్టింపులకు రాజకీయాలు పెట్టింది పేరు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ పంతాలు, పట్టింపులు ఎక్కువ. గతంలో జగన్ ఏకంగా.. రాజధాని అమరావతిని పక్కన పెట్టి.. మూడు రాజధానులు తీసుకువచ్చారు. ఇప్పుడు చంద్రబాబు సర్కారు కూడా.. తొలినాళ్లలో కొన్ని పథకాల పేర్లు మార్చింది. అయితే.. ఇది మొన్నటి మాట. ఈ పంతాలకు సీఎం చంద్రబాబు ఫుల్ స్టాప్ పెట్టారు. జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలనే సెలైంట్‌గా వినియోగించుకుంటున్నారు.