2025 గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పలు మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. 73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబర్‌లో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పర్యటనలో ఆయన ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.