టీ కోసం దిగగా.. రూ.10 కోట్ల విలువైన నగలతో డ్రైవర్ జంప్!

60చూసినవారు
టీ కోసం దిగగా.. రూ.10 కోట్ల విలువైన నగలతో డ్రైవర్ జంప్!
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. కిషన్ లాల్ అనే వ్యాపారి బంగారం ఆభరణాలు డెలివరీ చేయడానికి కారులో విజయవాడ బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును మునగచెర్ల వద్ద వదిలేసి బంగారంతో పారిపోయాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్