AP: సంక్రాంతి జోష్ మొదలైంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని గోదావరి కాల్వలో కేరళ తరహాలో పడవ పోటీలు నిర్వహించారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే సత్యానందరావు ఆధ్వర్వంలో ఈ పోటీలు జరిగాయి. దీంతో పాటు ఈత పోటీలు నిర్వహించారు. వీటిని తిలకించేందుక పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.