వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ
గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తిరుపతి రూరల్ మండలం ఓటరు పంచాయతీ పరిధిలోని గంగిరెద్దుల కాలనీలోకి వరదనీరు చేరింది. సమాచారం తెలుసుకున్న తుడా మాజీ ఛైర్మన్, వైసీపీ యువనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గురువారం సాయంత్రం పర్యటించారు. ఇందులో భాగంగా గుడిసెల్లో నివాసిస్తున్న మహిళలను ఓదార్చారు. అనంతరం తినడానికి అవసరమైన 14రకాల నిత్యావసర సరుకులను ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు.