టీటీడీ కీలక నిర్ణయం... నేడు శ్రీవారి మెట్ల మార్గం మూసివేత

82చూసినవారు
టీటీడీ కీలక నిర్ణయం... నేడు శ్రీవారి మెట్ల మార్గం మూసివేత
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు (గురువారం) శ్రీవారి మెట్టు నడక మార్గం మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఈవో బుధవారం తెలిపారు. తిరుమలలో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

సంబంధిత పోస్ట్