తనకు భద్రత తగ్గించారని ప్రచారం చేసుకుంటూ, ప్రజల సానుభూతి పొందడానికి మాజీ సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ మంగళవారం అన్నారు. చిత్తూరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. అయినప్పటికీ భద్రత తగ్గించారని చెప్పడం సరికాదన్నారు.