థామస్ ను గెలిపించండి
వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ ను గెలిపించాలని ఆ పార్టీ ఎస్ ఆర్ పురం మండలాధ్యక్షుడు జయశంకర్ నాయుడు కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలసి పిల్లారి కుప్పం, యల్లంపల్లె, కనీకాపురం, బసిరెడ్డిపల్లె గ్రామాల్లో గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. నిరంజన్ రెడ్డి, బాబు నాయుడు పాల్గొన్నారు.