కేంద్ర బలగాలతో కవాతు

76చూసినవారు
కేంద్ర బలగాలతో కవాతు
బైరెడ్డిపల్లె పట్టణంలో ఎస్ఐ కృష్ణయ్య కేంద్ర బలగాలతో కలసి గురువారం కవాతు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ, మండలంలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలు మండలానికి వచ్చాయన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్