పలమనేరు: హత్య కేసులో వ్యక్తి అరెస్ట్
పలమనేరులో ఈ నెల 13న శివకుమార్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడు సమీర్ ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదివారం తెలిపారు. శివకుమార్ భార్యకు నిందితుడితో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమన్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.