జగన్ చిత్తూరు జిల్లా పర్యటన దేనికో?: మాజీ మంత్రి

61చూసినవారు
గత ఎన్నికల సమయంలో పలమనేరు నడిబొడ్డున ప్రజలకు ఎమ్మెల్యే వెంకటేగౌడ, సీఎం జగన్ ఇచ్చిన హామీలకే దిక్కు లేదని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. పలమనేరులోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హామీలు నెరవేర్చకుండా జగన్ ఏ ముఖం పెట్టుకొని పలమనేరు నియోజకవర్గానికి వస్తారని ప్రశ్నించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ ఏరుగుత్తి బాలాజీ తదితరులు టీడీపీలో చేరడంతో ఆయన పసుపు కండువా కప్పారు.

ట్యాగ్స్ :