చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో రామచంద్రాపురం మండలం నెన్నూరు నుంచి టీటీ కండ్రిక వరకు ఉన్న గుండోడుకణం రోడ్డు నిర్మాణానికి మహర్థశ పట్టనుంది. ఈ మేరకు సోమవారం చంద్రగిరి నియోజకవర్గ పంచాయతీరాజ్ డీఈ ప్రభాకర్ రెడ్డి, ఏఈ చిన్నయ్య రోడ్డు నిర్మాణానికి స్థలం పరిశీలన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తైతే తిరుపతి-పచ్చికాపలం ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రజలు ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు.