AP: అప్పులు కట్టడానికి ఆదాయం సరిపోని పరిస్థితుల్లో ఏపీ ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అన్నారు. సీఎం చంద్రబాబు కృషి ఫలితంగా రాష్ట్రానికి రూ.6 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉద్యోగ కల్పనలు జరిగాయన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లి, పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారన్నారు. అరాచక పాలనలో మంత్రి లోకేశ్ పాదయాత్ర చేసి ప్రజలకు భరోసా కల్పించారన్నారు. త్వరలోనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.