అండర్-19 మహిళల ప్రపంచ కప్లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఏకంగా 150 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 208 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన స్కాట్లాండ్ 14 ఓవర్లలో కేవలం 58 పరుగులకే కుప్పకూలిపోయింది. భారత బౌలర్లలో శుక్ల 4 వికెట్లు తీయగా, వైష్ణవి శర్మ, త్రిష చెరో 3 వికెట్లు తీశారు. తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది.