అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్, తెలుగుమ్మాయి గొంగడి త్రిష సరికొత్త రికార్డ్ సృష్టించింది. అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచింది. త్రిష.. స్కాట్‌లాండ్ బౌలర్లపై విజృంభించింది. మొదటి బంతి నుంచి దూకుడుగా ఆయన త్రిష బౌండరీలు, సిక్సర్లతో రెచ్చిపోయింది. 52 బంతుల్లో నాలుగు సిక్సర్లు, 12 ఫోర్లతో సెంచరీ నమోదు చేసింది.