చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం తిరుమల లడ్డూ వివాదంపై శాంతియుత ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు రామ్మూర్తి సోమవారం తెలిపారు. పవిత్రమైన తిరుమల లడ్డూలో కల్తీ జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిరసన ర్యాలీ చేపడతామని తెలిపారు.