ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జేసీ విద్యాధరి ఆర్డీఓలను, తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం జిల్లా సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.