Oct 06, 2024, 16:10 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
సుల్తానాబాద్: జీవిత కాలం గుర్తుండే జ్ఞాపకం ఫోటో
Oct 06, 2024, 16:10 IST
ఫోటో అంటే జీవితకాలం గుర్తుండిపోయే తీపి జ్ఞాపకమని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలో మండల ఫోటో, వీడియో గ్రాఫర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రమాణస్వీకార మహోత్సవానికి హాజరై నూతనంగా ఎన్నికైన సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లకు ఎప్పుడు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఫోటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.