Oct 05, 2024, 01:10 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు
Oct 05, 2024, 01:10 IST
పెద్దపల్లి జిల్లాలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ పాల్గొని.. గౌరీ దేవికి బతుకమ్మకు పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల అధినేత అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, పువ్వులను దైవంగా భావించే గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమన్నారు.