Oct 25, 2024, 14:10 IST/
రైతులకు మంత్రి తుమ్మల గుడ్ న్యూస్
Oct 25, 2024, 14:10 IST
తెలంగాణలోని పత్తి రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. పత్తి రైతుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. వాట్సాప్ నెంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన వివరాలు అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిద్ధమైంది. మంత్రి తుమ్మల ఆదేశాల మేరకు పత్తి పంట క్రయవిక్రయాలలో ఎలాంటి జాప్యం జరగకూడదని ఈ సేవలను ప్రారంభించింది.