వైభవంగా నిమజ్జనోత్సవం
కేవీబీ పురం మండలంలోని వాడవాడలో వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా వీధులలో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. వీధులలో రంగవల్లికలతో కూడిన ముగ్గులు వేసి స్వామివారికి ఆహ్వానం పలికారు. అనంతరం నిమజ్జనోత్సవ కార్యక్రమం పోలీసు భద్రత నడుమ వేడుకగా నిర్వహించారు.