వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ "ఎక్స్" వేదికగా ప్రకటించారు. ఈ విధానం ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుందని ఆరోపించారు. జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఓవైసీ ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్యాన్ని ఇది రాజీ చేస్తుందని విమర్శించారు. ప్రధాని మోదీ, అమిత్ షాకు తప్ప.. ఎవరికీ బహుళ ఎన్నికలు సమస్య కాదని పేర్కొన్నారు. మనకు ఏకకాల ఎన్నికలు అవసరం కాదని తేల్చిచెప్పారు.