మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు: కలెక్టర్

65చూసినవారు
మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు: కలెక్టర్
జిల్లా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన పరికరాలను సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగం, రూ. 4 లక్షల వ్యయంతో నూతనంగా కొనుగోలు చేసిన వైద్య పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు పరికరాలను వినియోగించాలని వైద్యులకు సూచించారు.

సంబంధిత పోస్ట్