పుత్తూరు పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ నందు గల మదర్ థెరిస్సా బధిర, బుద్ధిమాంద్యత పిల్లల పాఠశాల నందు శనివారం పిల్లలకు పండ్లు పంచిపెట్టారు. హెచ్ బి డి ఫైనాన్షియల్ బ్యాంక్ ఉద్యోగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వాహకులు హెచ్ బి డి ఫైనాన్షియల్ బ్యాంక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.