కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ముడా కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగించాలని లోకాయుక్తకు కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. విచారణను ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, లోకాయుక్త పర్యవేక్షించాలని కోర్టు సూచించింది. ఇక జనవరి 27లోగా లోకాయుక్త నుంచి నివేదికను కోరింది. ఇప్పటి వరకు సేకరించిన అన్ని పత్రాలను తదుపరి విచారణకు ఒక రోజు ముందు సమర్పించాలని పేర్కొంది.