ప్రభుత్వ భూమిలో ఉన్న గుట్టని సైతం వదలని ఆక్రమణదారులు

2934చూసినవారు
పలమనేరు మండలం కొలమాసనపల్లి పంచాయతీ పరిధిలోని గంగారపూరు గ్రామం వెనక ప్రభుత్వ స్థలంలో ఉన్న బండను, ప్రభుత్వ చెరువు నుంచి తీసిన మట్టితో చదును చేసి ఆక్రమించారు. భూ కబ్జాదారులు ప్రభుత్వ గుట్టలను సైతం వదలడం లేదు. అధికారుల అనుమతులతో సంబంధం లేకుండా ఇస్టానుసారంగా భూకబ్జాలు చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే ప్రభుత్వ చెరువులను పూర్తిగా ఆక్రమణదారులకు అప్పగించేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్