ముదరంపల్లె సర్పంచ్ చెక్ పవర్ కట్
చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం ముదరంపల్లె సర్పంచి జి. మంగమ్మ చెక్ పవర్ రద్దు చేస్తూ కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టర్ వేమా రెడ్డికి బిల్లులు ఇవ్వకుండా సర్పంచి కాలయాపన చేశారని రుజువు కావడంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోర్టు కలెక్టర్‌ను ఆదేశించింది. ఈక్రమంలో పంచాయతీ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచి డ్రా చేసే అధికారాన్ని కలెక్టర్ రద్దు చేశారు.