ఈ వృద్ధుడికి 188 ఏళ్లా?.. వీడియో వైరల్

58చూసినవారు
బెంగళూరుకు సమీపంలో ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటికి తీసుకువచ్చారు. అతడి వయసు 188 ఏళ్లు ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో ఆ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కు చెందిన సియారామ్ బాబా అని తెలిసింది. ఆయన వయసు 110 ఏళ్లు ఉంటాయని అంచనా. ఆయన రామ భక్తుడు అని, 10 ఏళ్ల పాటు ఒంటి కాలు మీద కఠినమైన తపస్సు చేశారని ప్రసిద్ధి.

సంబంధిత పోస్ట్