తెదేపా నాయకులు రాజకీయ కక్షలకు పాల్పడకుండా పీలేరు పంచాయితీ అభివృద్ధికి సహకారం అందివ్వాలని సర్పంచ్ డాక్టర్ షేక్ హబీబ్ బాష అన్నారు. మంగళవారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పీలేరు పంచాయతీ కార్యాలయంలో జరిగిన అవినీతి ఆరోపణలపై స్వయంగా తానే జిల్లా కలెక్టరు, డీపీఓలకు ఫిర్యాదు చేసి, తనతో పాటు, తాను సెలవులో ఉండగా 11 నెలల కాలం సర్పంచ్ గా ఉన్న ఉప సర్పంచ్ షేక్ జీనత్ షఫీపై కూడా విచారణ జరపాలని కోరినట్లు తెలిపారు.