ప్రమాదాలు జరగకుండా వాహనదారులు సురక్షితంగా ప్రయాణించాలనే లక్ష్యంతో మిషన్ పాట్ హోల్ ఫ్రీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం కె.వి పల్లి మండలంలోని సొరకాయల పేట పంచాయతీ మిన్నంరెడ్డి గారి పల్లెలో రోడ్డులో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో రోడ్డులో పడిన గుంతులకు టిడిపి ప్రభుత్వం మరమ్మత్తులు చేస్తోందని అన్నారు.