పీలేరు లోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి శుక్రవారం యువతి మృతి చెందింది. మృతదేహంతో బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేయగా సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం.ప్రైవేట్ ఆసుపత్రికి రోగులుతో వస్తే రకరకాల ఫీజుల పేరుతో లక్షల రూపాయలు దండుకుని చివరి నిమిషంలో ఇతర ప్రాంతాలకు రిఫర్ చేస్తారని విమర్శలున్నాయి. సంఘటనపై డిఎంహెచ్‌వో కొండయ్య ను వివరణ కోరగా జిల్లా అధికారులతో విచారణ చేయిస్తామని తెలిపారు.