పీలేరులో చోరీ కేసులో నిందితులైన ఆరుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను గురువారం పీలేరులో అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ పి. యుగంధర్ తెలిపారు. నిందితుల నుంచి రూ. 95 వేలు విలువ చేసే 19 గ్రాముల బంగారు నగలు, 3 మోటార్ సైకిళ్ళు, 5 సెల్ ఫోన్లు, 6 కత్తులను సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై బాలకృష్ణతో పాటు సిబ్బంది పాల్గొన్నారు అని సిఐ పేర్కొన్నారు. పట్టుబడిన నిందితులు పాత గుంతకల్లుకు చెందిన వారని తెలియజేశారు.